తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే.. ఈ మేరకు నిర్ణయం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం తీసుకుంది.

ఇప్పటికే.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఇవ్వనందుకు బంద్ పాటిస్తున్నాయి ప్రైవేట్ కాలేజీలు. ఈ బంద్ కారణంగా 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఇంత జరుగుతున్న ఎలాంటి అంశాలు పట్టించుకోకుండా… చోద్యం చూస్తోంది రేవంత్ సర్కార్. ఇక దీనిపై కేటీఆర్ సీరియస్ అయ్యారు.
నిన్న హైదరాబాద్‌లో వర్షాలకు ముగ్గురు యువకులు కొట్టుకుపోయారని గుర్తు చేశారు కేటీఆర్. హైదరాబాద్‌ని పట్టించుకునే వాడు లేడు.. ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, హైదరాబాద్ గురించి అడిగేటోడు కూడా లేడని ఆగ్రహించారు. ఇప్పుడు ఆరోగ్య సేవలు బంద్ అయినా పట్టించుకోడని ఫైర్ అయ్యారు.