బండి సంజయ్ కు ఊహించని షాక్ ఇచ్చారు బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేశాడని బండి సంజయ్ పై వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. సిటీ సివిల్ కోర్టులో వంద కోట్ల దావా పిటిషన్ వేశారు కేటీఆర్. ఇక కేటీఆర్ పిటిషన్ ను డిసెంబర్ 15న విచారించనుంది సిటీ సివిల్ కోర్టు. ఇక కేటీఆర్ పిటీషన్ పై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోవడంలేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. బంగారం షాపులలో పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. లా&ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఇప్పటికైనా ప్రజల కష్టాల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలపై కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.