ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ప్రస్తుతం రూ.600 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. దీపావళి వరకు రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో నేటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి కాలేజీలు.

ఇక ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ…విద్యార్థుల భవిష్యత్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నాం చేసిందని మండిపడ్డారు. ఫీజు బకాయిల భారాన్ని బీఆర్ఎస్ మాపై మోపిందని ఆగ్రహించారు. ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని… తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని బకాయిలు చెల్లిస్తు న్నామని తెలిపారు TS డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క.