తెలుగు ప్రజలకు అలర్ట్… ఏపీలో ఈరోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. నేడు అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గుంటూరు, ఉమ్మడి కృష్ణ, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలలో మోస్తారు వర్షాలు అధికంగా కురుస్తాయని పేర్కొన్నారు.

ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు తెలంగాణలోని మహబూబాబాద్, జనగాం, హనుమకొండ, నారాయణపేట, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాలో అధికంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచనలు జారీ చేశారు. వర్షాలతో పాటు ఈదురు గాలులు బలంగా వీస్తాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితులలో బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు.