అమరావతిలో ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి సీఎం చంద్రబాబు డిజైన్ ఖరారు చేశారు. రూ. 2500 కోట్లతో నిర్మించబోయే ఈ వంతెన 5.22 కిలోమీటర్ల పొడవు, 6 వరుసల రహదారుతో ఉండబోతోంది. హైదరాబాద్ – అమరావతి మధ్య దూరాన్ని సుమారు 35 కిలోమీటర్ల మేరకు తగ్గించనుందని అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ వంతెన అమరావతికి కొత్త గుర్తింపుగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉండగా… సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఎన్నో రకాల మంచి పనులను చేస్తున్నారు. చాలామందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ రైతులకు న్యాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గా డీఎస్సీ పరీక్షలకు ఎంపికైన వారికి త్వరలోనే ఉద్యోగాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇది మాత్రమే కాకుండా చాలా రకాల గొప్ప పనులను చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.