ఏపీలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు “వాహన మిత్ర” పథకం కింద సహాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో వాహన మిత్ర పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కొంత సమయాన్ని కేటాయించారు. అప్లికేషన్ ఫామ్ లను నింపి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. అర్హుల జాబితాను 24వ తేదీన ప్రకటించనున్నారు.

ఎంపికైన వారికి దసరా పండుగ రోజున వారి అకౌంట్లో రూ. 15000 జమ చేస్తారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉచిత బస్సు పథకం ద్వారా భారీగా నష్టపోతున్నామని ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారికి సహాయం చేసేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కొంత మేరకు భారం తగ్గుతుందని చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.