జూ.ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్‌కు గాయాలు అయ్యాయి. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో గాయపడ్డారు జూనియర్ ఎన్టీఆర్. స్వల్ప గాయాలేనని జూ.ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ గాయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే.. జూనియర్ ఎన్టీఆర్ కు గాయం అయిందని వార్తలు రాగానే.. ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ పేరుతో హ్యష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇది ఇలా ఉండగా… జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం జిమ్ లో ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నారు.
- షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్‌కు గాయాలు
- ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో గాయపడిన ఎన్టీఆర్
- స్వల్ప గాయాలేనన్న జూ.ఎన్టీఆర్ టీమ్.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది