మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్ రానుంది. “శ్రీనన్న అందరివాడు” పేరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్ రాబోతుంది. ఈ మేరకు ప్రకటన వచ్చింది. ఈ “శ్రీనన్న అందరివాడు” సినిమాలో పొంగులేటి పాత్రను పోషించనున్నారు సీనియర్ నటుడు సుమన్.

శ్రీనన్న అందరివాడు అనే టైటిల్‌తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు దర్శకుడు బయ్యా వెంకట నర్సింహ రాజ్. ఇక త్వరలో “శ్రీనన్న అందరివాడు” షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇది ఇలా ఉండగా..తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్‌పై నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధించారు. డ్రోన్లు ఎగరవేసి, గత ప్రభుత్వ కేసీఆర్ గుర్తులు అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆంక్షలు పెట్టారని అంటున్నారు. సెక్రటేరియట్ చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.