నేడు పాక్-భారత్ సూపర్-4 పోరు

-

నేడు పాక్-భారత్ సూపర్-4 పోరు జ‌రుగ‌నుంది. సూప‌ర్ సండే రోజున పాక్-భారత్ సూపర్-4 పోరు జ‌రుగ‌నుంది. దీంతో జ‌నాలు ఎంతో ఆతృత‌గా మ్యాచ్ చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్ 2025లో భాగంగా రెండోసారి తలపడనున్నాయి టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్లు.

ind vs pak
Pakistan-India Super 4 clash today

గ్రూప్ దశలో అజేయంగా సాగి.. అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది సూర్య సేన. దుబాయ్ వేదికగా నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత జట్టు, బ్యాటింగ్ – బౌలింగ్ రెండింటిలోనూ సమతౌల్యాన్ని సాధించింది. దీంతో సూర్యకుమార్ సేన ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగబోతోంది. పాకిస్తాన్ కూడా ఈ పోరులో గెలవాలని దూకుడు మీదే ఉంది. స్టార్ బౌలర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో సవాల్ విసరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news