LoC వెంట మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత నియంత్రణ రేఖ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్లో కవ్వింపులకు దిగింది పాక్. దీంతో… సమర్థవంతంగా ఎదుర్కొని పాక్ చర్యలను తిప్పికొట్టింది భారత సైన్యం.

సెప్టెంబర్ 20, సాయంత్రం 6.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది.
ఇది ఇలా ఉండగా…. నేడు పాక్-భారత్ సూపర్-4 పోరు జరుగనుంది. సూపర్ సండే రోజున పాక్-భారత్ సూపర్-4 పోరు జరుగనుంది. దీంతో జనాలు ఎంతో ఆతృతగా మ్యాచ్ చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్ 2025లో భాగంగా రెండోసారి తలపడనున్నాయి టీమిండియా, పాకిస్థాన్ జట్లు.