ఓజీ సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం సినిమా అయితే టికెట్ 1000 పెంచుకోవచ్చా? అంటూ ఆగ్రహించారు అంబటి రాంబాబు. సినిమా టికెట్ రేట్లు పెంచుకొని డబ్బు సంపాదించడం కాదు..కాస్త పరిపాలన మీద కూడా దృష్టి పెట్టండి అని డిమాండ్ చేశారు.

మిరాయ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదే.. జనాలు చూసి సినిమాకు డబ్బులు రావాలి గానీ.. టికెట్ రేట్లు పెంచుకొని కాదని చురకలు అంటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
ఇక అటు OG సినిమా టికెట్ ధరలపై వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. OG సినిమా టికెట్ ధరల పెంపు దారుణమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రభుత్వం ఉంది కదా అని సినిమాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.