విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రేపటి నుంచి అక్టోబర్ రెండు వరకు ఘనంగా జరగనున్నాయి. 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 22 బాలా త్రిపుర సుందరి దేవి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 23న గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు కనిపిస్తారు. 24న అన్నపూర్ణాదేవి అవతారంతో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. 25న కాత్యాయని దేవి అవతారంతో అమ్మవారు ముస్తాబు అవుతారు. 26న మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు ప్రజలకు కనిపించనున్నారు.

27న లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో కనిపించనున్నారు. 28న మహాచండి దేవి రూపంలో అమ్మవారు భక్తుల ముందుకు రానున్నారు. 29న సరస్వతి దేవి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. 30న దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు కనిపించనున్నారు. అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని దేవీ రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 2న రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 2న దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కోట్లాది సంఖ్యలో విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. 11 రోజులపాటు విజయవాడలో భారీగా భక్తుల రద్దీ కొనసాగనుంది.