Sharwanand Divorce: హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలోనే ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించిన ఈ హీరో అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు. హీరో శర్వానంద్ అనేక సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి 2024లో పండంటి ఆడబిడ్డ జన్మించింది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితం కొనసాగించిన శర్వానంద్ భార్య, కూతురుతో కలిసి సంతోషంగా కాలం గడిపారు. మరోవైపు సినిమాలలో కూడా చాలా చురుగ్గా నటించారు.

ఇదిలా ఉండగా… ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. శర్వానంద్ గత కొద్దిరోజుల నుంచి తన భార్యతో దూరంగా ఉంటున్నాడు అంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విషయం పైన హీరో శర్వానంద్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. కాగా, గత కొద్దిరోజుల నుంచి సెలబ్రిటీలు వివాహాలు చేసుకోవడం, విడాకులు ఇచ్చుకోవడం చాలా కామన్ అయిపోయింది. మీరు కూడా ఈ బాటలోనే పయనిస్తున్నారేమోనని కొంతమంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.