ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది. త్వరలోనే ఏపీలో సంజీవని పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం గురించి తెలిసిన చాలా మంది ఏమిటా అనే చర్చలు జరుపుతున్నారు. ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స అందించడం కోసం వైద్య సిబ్బంది ఏకంగా ఇంటి వద్దకే వచ్చి ట్రీట్మెంట్ ను ఇస్తారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రం అంతటా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి సాంకేతిక సాయంతో పాటు సహకారాన్ని అందించేందుకు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ముందుకు వచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంతో ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల మంచి పనులు చేస్తున్నారని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.