అధునాతన జీవితం లో ఆరోగ్యం తెలివితేటలు రెండూ రెండు రెక్కలు. ఇవి సమతుల్యంగా ఉండాలంటే శరీరానికే కాదు మనసుకూ పోషణ అవసరం. అదే అందించే సహజ ఔషధం మన ఆయుర్వేదం చెప్పిన బ్రాహ్మి కషాయం. ఇది మెమరీ పవర్ కాన్సన్‌ట్రేషన్, మెంటల్ క్లారిటీను పెంచి పిల్లల్లో చదువుపై ఆసక్తి కలిగిస్తుంది. తల్లిదండ్రులు సహజమైన, సురక్షితమైన మెదడు టానిక్ కోసం చూస్తుంటే, బ్రాహ్మి కషాయం మీ చిన్నారికి సరైన పరిష్కారం కావచ్చు. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన గుణాలు వాడే విధానం వయస్సుకు అనుగుణమైన మోతాదు గురించి తెలుసుకుందాం..
బ్రాహ్మి అనేది ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక. దీన్ని మేధ్య రసాయనం అని కూడా పిలుస్తారు అంటే జ్ఞాపకశక్తిని పెంచేది అని అర్థం. బ్రాహ్మి కషాయాన్ని క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుదల: నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు ఏకాగ్రత చాలా అవసరం. బ్రాహ్మి మెదడు కణాలను ఉత్తేజపరిచి, జ్ఞాపకశక్తి మరియు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. చదువుపై దృష్టి పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఒత్తిడి, ఆందోళన నివారణ: పరీక్షల ఒత్తిడి, లేదా ఇతర కారణాల వల్ల పిల్లల్లో వచ్చే చిన్నపాటి ఆందోళన మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో బ్రాహ్మి గొప్పగా పని చేస్తుంది.ఇది శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు: బ్రాహ్మిలో యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కషాయం పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, తరచుగా వచ్చే చిన్న చిన్న అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.
నిద్ర మెరుగుదల: కొంతమంది పిల్లల్లో నిద్ర సమస్యలు ఉంటాయి. బ్రాహ్మి నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపి, ప్రశాంతమైన, గాఢ నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. మంచి నిద్ర వారి మెదడు ఆరోగ్యానికి కీలకం.
బ్రాహ్మి కషాయాన్ని తయారు చేయడం కూడా సులభమే. తాజా బ్రాహ్మి ఆకులను నీటిలో మరిగించి, కొద్దిగా బెల్లం లేదా తేనె కలుపుకుని తాగించడం మంచి పద్ధతి.
బ్రాహ్మి కషాయం అనేది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన మందు. ఈ శక్తివంతమైన మూలికను వారికి అందించి వారిని ఆరోగ్యంగా మేధోపరంగా కూడా బలంగా తీర్చిదిద్దే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. ఈ చిన్న అలవాటు వారి భవిష్యత్తుకు పెద్ద పునాది అవుతుంది.