లాక్ డౌన్ పొడగింపు వదంతులపై కేంద్రం క్లారిటీ

-

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరింత కాలం కేంద్రం లాక్ డౌన్ కొనసాగించనుందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. లాక్ డౌన్ పొడగింపు ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది.

లాక్ డౌన్ పొడగింపుపై వస్తున్న వదంతులు, మీడియా కథనాలు పూర్తిగా నిరాధారమైనవని పీఐబీ వెల్లడించింది. ప్రసార భారతి కూడా ఆ వార్తలను ఫేక్ న్యూస్ అని పేర్కొంది. ఇలాంటి వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ పొడిగింపు ఆలోచన లేదని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ భయంతో పలు రాష్ట్రాల్లోని వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున కూలీలు బస్టాండ్‌లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం లాక్ డౌన్ పొడగింపు వదంతులను ఖండిచినట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది మృతిచెందినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news