ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కరోనాకు వ్యాక్సిన్‌ను ఇంకా తయారు చేయలేదు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు భిన్నమైన వ్యాక్సిన్లను కరోనా చికిత్సకు ఉపయోగిస్తూ ఆ వైరస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సైంటిస్టులు కూడా కరోనాపై పోరాటం చేయడానికి పాత టీబీ వ్యాక్సిన్‌ను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ముర్డోచ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో నైజెల్ కర్టిస్ అనే ఓ ప్రొఫెసర్ కరోనాపై ఫైట్ చేసేందుకు గత 100 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న పాత టీబీ వ్యాక్సిన్‌ను టెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌తో టీబీని, ఎర్లీ స్టేజ్‌లో ఉన్న బ్లాడర్ క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. ఈ వ్యాక్సిన్ ను.. bacillus Calmette-Guerin లేదా BCG అని పిలుస్తారు. ఇక దీని ఖరీదు కూడా తక్కువే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సైంటిస్టులు దీన్ని కరోనాపై ఫైట్ చేసేందుకు ప్రయోగించనున్నారు. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించగానే శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీంతో తెల్ల రక్తకణాలు యాక్టివ్ అయి.. శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బాక్టీరియాలను వెంటనే చంపేస్తాయి. అందుకనే ఈ వ్యాక్సిన్‌ను సైంటిస్టులు తమ ప్రయోగానికి ఎంచుకున్నారు.
మెల్‌బోర్న్‌లో ఉన్న 4వేల మంది హెల్త్‌కేర్ సిబ్బందికి బీసీజీ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీరు హాస్పిటళ్లలో ఇప్పటికే కరోనా రోగులకు చికిత్స అందించడంలో సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు కరోనా బారిన పడకుండా ఉండేందుకు గాను ముందుగానే బీసీజీ వ్యాక్సిన్‌ను వీరికి ఇవ్వనున్నారు. దీంతో కొద్ది రోజుల తరువాత వీరిని మళ్లీ పరీక్షించనున్నారు. ఈ క్రమంలో వీరికి కరోనా సోకకపోతే.. అప్పుడు ఈ బీసీజీ వ్యాక్సిన్‌ను కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఉపయోగించనున్నారు. ఇక అది సక్సెస్ అయితే.. కరోనాకు చికిత్స అందించడం చాలా సులభతరం కానుంది. మరి ఈ విషయంలో సైంటిస్టులు విజయం సాధిస్తారో, లేదో చూడాలి..!