అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. శనివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తవ్వగా.. ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే, ఈసారి మార్క్సిస్ట్ నేత అనురకుమార దిశనాయకే ఆధిక్యం కనబరుస్తున్నారు.నేషనల్ పీపుల్స్ పవర్ అలయన్స్ తరఫున బరిలోకి దిగిన దిశనాయకేకు 53 శాతం ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేతలు సజిత ప్రేమదాస 22 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, ప్రజెంట్ అధ్యక్షుడు విక్రమసింఘే మూడో స్థానంలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో ముగ్గురి మధ్య పోటీ నెలకొనగా అధ్యక్షుడు విక్రమ సింఘేతో పాటు నేషనల్ పీపుల్స్ పవర్ (NPP)కి చెందిన అనుర కుమార దిసనాయకే, సమగి జన బలవేగయ (SJB) నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస(57) పోటీ చేశారు. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఆధారంగా అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే ప్రెసిడెంట్ అవుతారు.తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. సోమవారం లోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.