అవును సిఎంని ప్రశ్నించాడు అని ఒక జర్నలిస్ట్ పై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక వెబ్ సైట్ ఎడిటర్ ట్విట్టర్ లో ప్రశ్నించాడు.. దేశంలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రామజన్మభూమి పేరిట ఓ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టాలని ఆయన భావించారు. ఈ నేపధ్యంలో యోగిని ‘ది వైర్’ వెబ్‌సైట్‌కు చెందిన ఎడిటర్ సిద్ధార్ద్ వరదరాజన్ ప్రశ్నించారు.
వరదరాజన్ చేసిన ట్వీట్ ఒకసారి చూస్తే… తబ్లిగి జమాత్ కార్యక్రమం జరిగిన రోజే ఆదిత్యనాథ్ కూడా రామనవమి ఉత్సవం పేరుతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు కార్యక్రమం చేపట్టాలనుకున్నారని… కరోనా వైరస్ నుంచి రాముడు కాపాడతాడంటూ ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నారని అని అతను ట్వీట్ చేసాడు. అలాగే మరో ట్వీట్ చేసాడు అతను.
లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ భారీ ప్రోగ్రాం నిర్వహిస్తే, భక్తులను కరోనా వైరస్ నుంచి ఆ రాముడు కాపాడతాడు కానీ, యోగిని మాత్రం కాపాడడు అని అయోధ్య ఆలయ ట్రస్ట్ అధికారిక హెడ్, హిందుత్వ యోధుడు ఆచార్య పరమహంస చెప్పారని ట్వీట్ చేయడం తో ఆ ట్వీట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Statement by the Founding Editors of The Wire: pic.twitter.com/frw5oRxw18
— The Wire (@thewire_in) April 1, 2020