పాలసీలు కట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్…!

-

కరోన వైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి గానూ కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకి వచ్చింది. ఇది పక్కన పెడితే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈఎంఐల చెల్లింపు విషయంలో మూడు నెలల మారిటోరియం విధించింది.

ఇప్పుడు మరో ఉపశమనం కల్పించారు. పాలసీదారులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వెహికల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లుబాటును ఏప్రిల్ 21వ తేదీ వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో పాలసీదారులు తమ ఇన్సూరెన్స్‌లను రెన్యూవల్ చేసుకోకలేకపోతున్నారు కాబట్టి… లాక్‌డౌన్ సమయంలో ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీలు వచ్చే వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపింది.

మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు ఇన్సూరెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవాల్సిన వారు… తమ ప్రీమియాన్ని ఏప్రిల్ 21 లేదా అంతకంటే ముందే చెల్లించుకోవచ్చని, చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ బీమా కవరేజీని కొనసాగించాలని చెప్పిన ఆర్ధిక శాఖ… 2020 ఏప్రిల్ 21ని ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీగా లెక్కలోకి తీసుకోవాలని ఆర్ధిక శాఖ సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news