ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ ని తప్పించడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రమేష్ కుమార్ విషయంలో కొంత కాలంగా ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఎన్నికల కమీషనర్ పదవి విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఆయన పదవి కాలం అర్హతలను తగ్గిస్తూ ఆర్డినెన్స్ ని తయారు చేయగా దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఆయన తర్వాత ఎన్నికల కమీషనర్ గా ఎవరిని నియమించే అవకాశం ఉందనే చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ పదవి కోసం జగన్ రమాకాంత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, జవహర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో తుడా చైర్మన్ గా ఉన్న రామ సుందర్ రెడ్డిని ఈ పదవిలో కూర్చో బెట్టారు అనే ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతూ వస్తుంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.
ఆయన కేవలం ఎస్ఈసీ సెక్రటరీ మాత్రమే అని, జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మరోసారి రిలీజ్ చేసి అది కేవలం ప్రచారం మాత్రమే అని పేర్కొంది. ప్రస్తుతం కమీషనర్ గా ఉన్న రమేష్ కుమార్ ను తప్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ని కూడా బయటపెట్టింది, పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్ వివరాలను ప్రభుత్వం రాత్రి 10.30 గంటల సమయంలో ఆ జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టింది.