లాక్ డౌన్ తో ఇప్పుడు జరుగుతున్న నష్టం గురించి అందరికి తెలిసిందే. ఈ లాక్ డౌన్ తో దేశం చాలా నష్టపోయింది. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. కరోనా నష్టం ఇప్పటి కంటే భవిష్యత్తులో ఎక్కువగా కనపడుతుంది. ఒక్క ఫార్మా రంగం మినహా ఏ ఒక్క రంగం కూడా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి దాదాపుగా లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
లాక్ డౌన్ తర్వాత అసలు ఏయే రంగాలు కోలుకునే అవకాశం ఉందీ అనేది ఇప్పుడు చూస్తే… రెండు మూడు రంగాలకు డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు. ఫార్మా, వైద్య, ఆరోగ్య సామగ్రి, డిజిటల్ కంపెనీలు కొవిడ్-19 నేపథ్యంలో భారీగా డిమాండ్ ఉన్నవి. డిజిటల్ ప్రపంచంతో సంబంధాలుండే రంగాలు బాగా పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. లాజిస్టిక్స్, సరఫరా రంగాలు వేగంగా పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.
నిత్యావసర వస్తువులకు, టెలికాం రంగాలకు కూడా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉందని… రవాణా, నిల్వ, గిడ్డంగుల వంటి రంగాలు లాక్‌డౌన్ ఎత్తివేత వెంటనే వేగంగా తమ మార్కెట్ ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ప్రయాణాలు, హోటళ్లు, విదేశీ ప్రయాణాలు, షాపింగ్ మాళ్లు, చెప్పులు, బట్టలు వంటివి కూడా వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇ-కామర్స్, రిటైల్, హోం డెలివరీ వంటివి మరింత వేగంగా పెరిగే సూచనలు ఉన్నాయి.