ధోనిని ఒత్తిడి చేయకండి… వెళ్తే ఇక వచ్చే అవకాశం లేదు…!

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేను ఆడతా అంటే వద్దు వెళ్ళిపో అంటున్నారు టీం ఇండియా అభిమానులు, వాట్సాప్, సోషల్ మీడియా యునివర్సిటి విద్యార్ధులు. ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ తర్వాత ధోని తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ధోని మీద ఇప్పుడు రిటైర్మెంట్ ఒత్తిడి చాలా వరకు ఉంది. అతను జట్టు నుంచి తప్పుకుని యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం.

దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ ధోనిని రిటైర్మెంట్ ఒత్తిడిలోకి నెట్టకుండా ఉండటమే మంచిదని, ఎందుకంటే అతను ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని అభిప్రాయపడ్డాడు. “ధోని తప్పుకుంటే ఇంకా భారత జట్టులోకి రావడానికి కుదురుతుందా…? ఇది అంత సులభం కాదని అన్నాడు. ధోని గురించి నేను చూసినది ఏమిటంటే, అతను భారత క్రికెట్‌కు ఇంకా సేవలు అందించడానికి రెడీ గా ఉన్నాడు.

ఇంగ్లండ్‌ లో జరిగిన ప్రపంచ కప్ లో ఆట పరంగా రన్ చేజ్స్‌లో అతను తప్పు చేసిన ఒకటి లేదా రెండు సందర్భాలు ఉన్నాయి గాని… సాధారణంగా ధోని చాలా ప్రతిభావంతుడు అని కొనియాడాడు. ధోనికి మాత్రమే అతని మానసిక స్థితి తెలుసని అన్నాడు. ధోని అవసరం చాలా ఉందని అన్నాడు. ప్రస్తుతం ధోని ఐపిఎల్ కోసం రెడీ అవుతున్నాడు. టి20 ప్రపంచ కప్ లో ధోని ఆడే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news