మనం దేశం ఈ నాలుగు అంశాల్లో నిజంగా గ్రేట్…!

-

కరోనా కట్టడి విషయంలో మన దేశం ప్రపంచానికి నిజంగానే ఆదర్శం అనేది చాలా మంది చెప్తున్న మాట. అమెరికా సహా యూరప్ దేశాలు మనని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది వాస్తవం. కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో చాలా దేశాలు ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నాయి. కరోనా ప్రభావాన్ని చాలా తక్కువ అంచనా వేసి ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి.

కాని మన దేశం మాత్రం నాలుగు విషయాల్లో చాలా జాగ్రత్తలు పడింది…

కరోనా ప్రభావాన్ని ముందే అంచనా వేసిన మోడీ సర్కార్… అంతర్జాతీయ విమానాలను పూర్తిగా ఆపేసింది. రాష్ట్రాల, దేశాల సరిహద్దులను మూసి వేయడం తో ఒక ప్రాంతం వారు మరో ప్రాంతంలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు పడ్డారు.

ప్రధాని మోడీ మాట వేదం… ఈ విషయంలో దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుని పాటించడమే కాదు… ఆయన చెప్పిన దీపాల కార్యక్రమం కూడా విజయవంతం చేసారు ప్రజలు. ఆయన మాట మీదే దేశం నడిచింది.

లాక్ డౌన్… కరోనా కట్టడిలో దేశం తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే. లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించిన తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి తగ్గింది. ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే ఎక్కడా సరే మోడీ సర్కార్ వెనక్కు తగ్గలేదు.

మందుల కొరత లేకుండా… దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో చాలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఫార్మా కంపెనీలు రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాలను భారీగా సరఫరా చేయడం మొదలుపెట్టాయి. దీనితో దేశంలో మందుల కొరత అనేది ఎక్కడా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news