కరోనా కోరల్లో చిక్కుకుపోయిన పత్రికా రంగాన్ని  కాపాడే దారి ఇదొక్కటే !

-

ప్రపంచ దేశాలకు మనుషులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల వేలల్లో మరణాలు సంభావిస్తుండగా లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అన్నదానిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐరన్ ముట్టుకున్నా, ప్లాస్టిక్ ముట్టుకున్నా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఇలా వార్తలు రకరకాలుగా ప్రపంచ స్థాయిలో వినబడుతున్నాయి. అయితే వస్తున్న వార్తల్లో ప్రధానంగా వార్తాపత్రికలు ద్వారా కూడా కరోనా వైరస్ ఆటోమేటిక్ గా శరీరంలోకి ప్రవేశిస్తుంది అని ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా పత్రికలు మ్యాగజైన్ల సంస్థలు తీవ్ర నష్టాల్లో పడ్డాయి. ప్రజలెవరూ వార్తాపత్రికలను కొనటానికి సాహసించడం లేదు.TELUGU NEWSPAPERSమామూలుగానే ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా రావటంతో పత్రికారంగం డేంజర్ జోన్ లో పడటం జరిగింది. కాగా కరోనా వైరస్ రాకతో ప్రస్తుతం పత్రికారంగం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పత్రిక రంగాన్ని కాపాడుకోవాలంటే ఆయా పత్రికా సంస్థలు సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూపుల ద్వారా ప్రమోట్ చేసుకుంటే మంచి బిజినెస్ జరుగుతుందని చాలామంది అంటున్నారు.

 

మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండటంతో.. మనిషికి మనిషి మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ విధంగా పత్రికా సంస్థలు వ్యవహరిస్తే బాగుంటుందని అంటున్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల పత్రికా రంగం కుదేలు అవటంతో చాలామంది పాత్రికేయులు అర్ధాంతరంగా తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొన్ని పత్రికా సంస్థలు రాజకీయ పార్టీల ప్రోద్బలంతో నడుస్తున్న…కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం రాజకీయ వార్తలు లేకపోవటం మరియు లాక్ డౌన్ ఉండటంతో అవి కూడా అనేక అవస్థలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్రికా రంగానికి చెందిన యజమానులు… తమ వార్త పత్రికలను కాపాడే దారి సోషల్ మీడియా ఒకటేనని చాలామంది అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సర్క్యులేషన్ చేసుకుంటే లాభాలు పొందే అవకాశం ఉందన్న టాక్ గట్టిగా వినబడుతుంది. 

 

Read more RELATED
Recommended to you

Latest news