ఒక సంబంధంలో బంధం బలంగా ఉండాలంటే నిత్యం ప్రేమను, అభిమానాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. దీనికి ఖరీదైన బహుమతులు లేదా పెద్ద పెద్ద ప్రణాళికలు అవసరం లేదు. కేవలం ఒక్క నిమిషం కేటాయించి, చిన్నపాటి చర్యలతో మీ భాగస్వామికి (Partner) సంతోషాన్ని, భద్రతా భావాన్ని అందించవచ్చు. రోజువారీ జీవితంలోని ఒత్తిడిలో కూడా మీ బంధాన్ని తాజాగా ఉంచడానికి ఈ మూడు సూక్ష్మ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. మరి వాటి గురించి చూద్దాం..
మీ భాగస్వామిని ఒక్క నిమిషంలో సంతోషపరచడానికి మొదటి మరియు శక్తివంతమైన మార్గం మనస్ఫూర్తిగా ప్రశంసించడం. ఉదయం లేవగానే వారి గురించి మీకు నచ్చిన ఒక చిన్న విషయం చెప్పండి. ఉదాహరణకు ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఈ రోజు ఉదయం నువ్వు చేసిన కాఫీ చాలా బాగుంది అని చెప్పండి. పాట్నర్ ను ప్రశంసించండి ఒత్తిడిలో కూడా నువ్వు సమస్యలను హ్యాండిల్ చేసే పద్ధతి నాకు చాలా ఇష్టం అని చెప్పండి.
ముఖ్యంగా మీరు ఇలా చెప్పడం వారి ప్రయత్నాన్ని లేదా పాత్రను ప్రశంసించడం చాలా ముఖ్యం. ఈ చిన్నపాటి మెచ్చుకోలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మీరు వారిని ఎంత శ్రద్ధగా గమనిస్తున్నారో తెలియజేస్తుంది. ఈ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఆ రోజంతా వారి మూడ్‌ను మెరుగుపరుస్తుంది.

రెండవ చిట్కా వారికి కేవలం ఒక్క నిమిషం పూర్తి ఏకాగ్రతతో వినడం. మీ భాగస్వామి ఏదైనా చెబుతున్నప్పుడు, మీరు మీ ఫోన్‌ను పక్కన పెట్టి, వారి కళ్లలోకి చూస్తూ వినండి. వారి మాటలను మధ్యలో ఆపకుండా వారు చెప్పేది చిన్న విషయమైనా దాన్ని గుర్తించండి Oh, Really? అవునా అని అంటూ వుండండి. ఈ ఒక్క నిమిషం మీరు పూర్తిగా వారిపైనే దృష్టి పెడుతున్నారని వారికి అనిపించాలి.
అంతేకాకుండా ఈ ఒక్క నిమిషంలో ఒక చిన్న స్పర్శ ఇవ్వండి. అది వెనుక నుంచి గట్టిగా ఆలింగనం (Hug) చేసుకోవడం కావచ్చు, చేతిని సున్నితంగా తాకడం కావచ్చు, లేదా బుగ్గపై ముద్దు పెట్టడం కావచ్చు. ప్రేమను వ్యక్తం చేసే ఈ శారీరక స్పర్శలు వారికి సురక్షితమైన మరియు ప్రేమపూర్వకమైన అనుభూతిని అందిస్తాయి. ఈ చిన్నపాటి చర్యలు మీ బంధానికి అద్భుతమైన బలాన్ని ఇస్తాయి.
