దర్శకుడికి రవితేజ ఆర్డర్స్

-

కోలీవుడ్ లో విజయ్ నటించిన తెరి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అత్లీ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా రీమేక్ గా తెలుగులో సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కనుంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ విషయంలో రవితేజ ఇన్వాల్వ్ మెంట్ అవుతున్నాడట. తెరి లైన్ మాత్రమే తీసుకుని స్క్రీన్ ప్లే మొత్తం ఫ్రెష్ గా రాయమని ఆర్డర్స్ పాస్ చేశాడట.

అలా అయితేనే తాను ఈ సినిమా చేస్తానని చెప్పాడట. సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. తమిళ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కథ మాత్రం అలానే ఉంటుందని కాని కథనం మాత్రం అలా ఉండదు. అంటే అక్కడ సినిమాకు ఇక్కడ సినిమాకు కథ విషయంలో తప్ప సీన్స్ తో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. మరి రవితేజ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news