ప్రాణాలు నిలబెట్టిన తెలంగాణా పోలీస్, సెల్యూట్…!

-

కరోనా లాక్ డౌన్ చాలా మందికి నేడు ఇబ్బందికరంగా మారింది. కరోనా రోగులకు మినహా ఇతర రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇక గర్భిణి పరిస్థితి అయితే మరీ తీవ్రంగా ఉంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్ళినా సరే కొన్ని కొన్ని చోట్ల సాధ్యం కావడం లేదు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఏమో గాని తెలంగాణా పోలీసులు మాత్రం వెంటనే స్పందిస్తున్నారు.

మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం హయత్‌నగర్‌ నివాసి జుబేరియా బేగం ఆదివారం ఉదయం 10 గంటలకు జాయిన్ అయ్యారు. రాత్రి 10.30 గంటలకు పురిటి నొప్పులు మొదలు కావడంతో… ప్రసవ సమయంలో పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గమనించిన వైద్యులు… కోఠిలోని ఆస్పత్రికి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు సూచించారు. అప్పుడు ఏ ఒక్కటి కూడా అందుబాటులో లేదు.

వెంటనే… కుటుంబ సభ్యులు డయల్‌ 100కు కాల్‌ చేయగా డ్యూటీలో ఉన్న చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పెట్రో కార్‌-1 కానిస్టేబుల్స్‌ ప్రశాంత్‌, అక్బర్‌, హోంగార్డ్‌ శ్రీను మలక్‌పేట ఆస్పత్రికి వెంటనే చేరుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పురిటి నొప్పులతో బాధపడుతున్న జుబేరియా బేగంను కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ ఆడ శిశువుకి జన్మనిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news