వైరల్‌ వీడియో – 7 ఏళ్ళ చిన్నారి ఆటకు ప్రపంచ క్రికెట్ ఫిదా…!

-

సోషల్ మీడియా పుణ్యమా అని పిల్లల ప్రతిభ బయటపడుతుంది. ప్రతిభ ఉన్న వాళ్ళను గుర్తించడానికి సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా క్రీడల్లో ప్రతిభ అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా బయటపడుతుంది. తాజాగా 7 ఏళ్ళ చిన్నారి బ్యాటింగ్ చూసి ప్రపంచ క్రికెట్ ఫిదా అయిపోయింది. ఏ దేశమో కాదు… ఆ చిన్నారిది మన దేశమే. ఆమె పేరు పరి శర్మ…

ఏడేళ్ల చిన్నారి బ్యాటింగ్ వీడియో చూసి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మైఖేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ షాక్ అయ్యారు. ముఖ్యంగా ఆమె ఫుట్ వర్క్ చూసి షాక్ అయ్యారు. అంత చిన్న వయసులో ఏ విధంగా అలా ఆడుతుంది అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. కాబోయే క్రికెట్ దిగ్గజం అంటూ కామెంట్ చేసారు. “ఈ వీడియోని ఒకసారి చూడండని… 7 సంవత్సరాల పరీ శర్మ అని వీడియో పోస్ట్ చేసాడు వాన్.

బ్యాటింగ్ చేస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉందన్నాడు. అలాగే షాయ్ హోప్ కూడా పరీ వీడియోని షేర్ చేసి.. నేను ఎదిగాక పరీ శర్మలా ఆడుతాను అని కామెంట్ చేసాడు. టీం ఇండియా మహిళా క్రీడాకారిణి శిఖా పాండే… పరీ ఎక్కడ ఉన్నా సరే తనని కలుసుకొని ఆమె నుంచి శిక్షణ పొందాలని తనకు ఉందని శిఖా కామెంట్ చేయడం విశేషం. మీరు చూడండి ఒకసారి… ఆమె టైమింగ్ చాలా బాగుంది.

Read more RELATED
Recommended to you

Latest news