కరోనా వైరస్ బయటపడిన నాటినుండి ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒక పక్క హెచ్చరికలు చేస్తూ మరో పక్క సూచనలు ఇస్తుంది. ఇటువంటి సమయంలో మందులేని ఈ వైరస్ ని ఎదుర్కొంటున్న చాలా దేశాలు లాక్ డౌన్లు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.ప్రస్తుతానికి ఉన్న మార్గం ఏకైక మార్గం ‘కరోనా వైరస్ నియంత్రణ’ చేయడమే అని ప్రపంచ దేశాలు చాలా పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దాదాపు రెండు నెలల నుండి లాక్ డౌన్లు అమలు చేస్తున్న దేశాలు ఆర్ధికంగా నష్టపోతున్న తరుణంలో లాక్ డౌన్లు ఎత్తివేయాలని అనుకుంటున్నయి. ఇటువంటి సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరికొత్త ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్ వ్యూహన్ ల్యాబ్ నుండి విడుదల చేసినట్లు ఇటీవల కొన్ని దేశాలు ఆరోపించాయి. అయితే ఆ ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి.
చైనా దేశానికి ఇండైరెక్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు వైరస్ ప్రపంచంలో రాకముందు చైనాలో ఉధృతంగా ఉన్న టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ నుండి ఒక్క ప్రకటన రాలేదు. ప్రపంచ దేశాలను హెచ్చరించే లేదు. కానీ ఎప్పుడైతే ప్రపంచదేశాలు చైనా పై అనుమానం వ్యక్తం చేస్తున్నాయో ఇటువంటి టైం లో చైనా కి సపోర్ట్ గా మాట్లాడటం తో … ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రకటనలను నమ్మకూడదని అనేక దేశాలు అంటున్నాయి. కరోనా వైరస్ చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన కుట్ర లాగా ఉందని చాలా దేశాల అధికారులు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.