హెల్ది అయిన షీర్ కుర్మాఎలా చేసుకోవాలంటే…!

-

కరోనా పుణ్యమా అని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పండగలు లేవు. స్వీట్ షాపులు కూడా బంద్. మరి ఇటువంటి సమయంలో పిల్లలు, పెద్దలు అందరు ఇంట్లోనే ఉంటున్నారు. వారి కోసం ఏదైనా స్పెషల్ వంటకాలను నేర్చుకున్నారా. ఎప్పుడు చేసే వంటలు కాకుండా ఇలా కొత్తగా షీర్ కుర్మా తయారు చేయండి.

షీర్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు: సేమ్యా ½ కిలో, వెన్న తీయని పాలు 1 లీటర్, పంచదార 1 కప్పు, బాదం ¼ కప్పు, పిస్తా ¼ కప్పు, జీడిపప్పు ¼ కప్పు, మిల్క్ మెయిడ్ 1 కప్పు, కుంకుమ పువ్వు ½ స్పూన్, యాలకులు 4, ఎండు ద్రాక్ష ½ కప్పు, ఖర్జూరం తరుగు 10 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వెన్న కొద్దిగా.

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వెన్న వేయాలి. వెన్న కరిగిన తరువాత సేమ్యా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత కొంచెం పంచదార వేసి వేగిన తరువాత కొద్ది కొద్దిగా పాలు పోసి కలుపుతూ ఉండాలి. పాలు కాగి పొంగు వచ్చాక ఎండు ద్రాక్ష, 2 యాలకులు, సగం బాదం, పిస్తా, జీడిపప్పు, మిగిలిన పంచదార వేసి కలపాలి. సేమ్యా ఉడికి పాలు సగం అయ్యే వరకు సన్నని మంట పై పెట్టి కలపాలి. ఈ మిశ్రమంలో మిల్క్ మెయిడ్ వేసి పది నిమిషాలు తర్వాత కుంకుమ పువ్వు, మిగిలిన డ్రై ఫ్రూట్స్, యాలకులు, ఖర్జూర తరుగు వేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే షీర్ కుర్మా రెడీ.

పోషక విలువలు: కేలరీస్ 1080, కార్బోహైడ్రేట్స్ 113g, ఫాట్ 54 g, ప్రోటీన్స్ 39 g, కొలెస్ట్రాల్ 142 g, షుగర్స్ 34g.

Read more RELATED
Recommended to you

Latest news