అరుగుమీద ఆడుకుంటున్నారా… ఈ వార్త చదవండి!

-

కరోనా మహమ్మారి పుణ్యమా ని అంతా లాక్ డౌన్ లో ఉన్నారు. ఏదైనా పని ఉంటే తప్ప రోడ్లపైకి రావొద్దు.. అత్యవసరపరిస్థితుల్లో రోడ్లపైకి వస్తే మాస్కులు ధరించండి అని ప్రభుత్వాలు మొత్తుకుంటూ ఉన్నాయి.. జాన్లు కూడా ఉన్నంతలో బాగానే పాటిస్తున్నారు. ఈ క్రమంలో రోజంతా ఇంట్లో ఉండటం తో ఏమాత్రం టైం పాస్ అవ్వడం లేదు అని… చుట్టుపక్కల నాలుగురు కలిసి క్యారం బోర్డులు, చెస్సులు, వైకుంఠపాళీ, అష్టా చెమ్మ వంటి ఆటలు తెగ ఆడేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే… ఒకసారి ఈ వార్త చదవండి!

తాజాగా తెలంగాణలోని సూర్యాపేట లో ఒక మహిళ అష్టాచెమ్మ ఆడటం వల్ల జరిగిన అరాచకం అంతా ఇంతా కాదు! అవును… రోజంతా ఇంట్లో కూర్చుని బోర్ కొట్టేస్తుంది… టీవీల్లో కూడా వేసిన సినిమాలే వేస్తున్నారు. సీరియల్స్ కూడా ఆగిపోయాయి… ఏ న్యూస్ ఛానల్ చూసిన కరోనా వార్తలే… అనుకుందో ఏమో కానీ… అష్టాచెమ్మ ఆడదామని పక్కింటికి వెళ్లింది. అలా ఒక్క ఇంటితో ఆపేసిందనుకుంటే పొరపాటే! మరీ ఖాళీగా ఉందో ఏమో కానీ… ఇలా అష్టాచెమ్మ పేరున అప్పుడప్పుడూ ఒక్కో పక్కింటికీ వెళ్లింది. దాందేముందిలే అనుకునేరు… అప్పటికే ఆమెకు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ద్వారా అప్పటికే ఆమెకు కరోనా సోకింది! ఆ విషయం తెలియని ఆమె… పక్కింటోళ్లలో సుమారు 31 మందికి కరోనా వ్యాప్తి చెందడానికి కారణం అయ్యిందట!

ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదూవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కరోనా రోజు రోజుకీ చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కనీసం పక్కింటి వారి వద్దకు కూడా వెళ్లకూడదని హెచ్చరించిన హెచ్చరికల విలువ ఇప్పుడు తెలిసొస్తుందేమో జనాలకు!!

Read more RELATED
Recommended to you

Latest news