16 ఏళ్ళ వయసులో డేట్ కి వెళ్ళా; రాశీ ఖన్నా…!

-

సోషల్ మీడియా అందుబాటులోకి రావడం ఏమో గాని ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సహా పలువురు మహిళా నటులు కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి కొందరు చేస్తుంటే సినిమా అవకాశాల కోసం మరి కొందరు చేస్తున్నారు. రోజు రోజుకి ఈ వ్యాఖ్యల తీవ్రత పెరుగుతుంది గాని ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి అనేది కనపడటం లేదు.Rashi khanna AT AdangaMaru Press meet Photos

తాజాగా ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా కొన్ని వ్యాఖ్యలు చేసింది. తాను 16 ఏళ్ళ వయసు లోనే డేటింగ్ కి వెళ్ళా అని చెప్పింది రాశీ. తాను ఆ వయసులోనే ఓ అబ్బాయితో కలిసి డేటింగ్‌కు వెళ్ళా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నన్ను డేట్‌కు పిలిచాడని చెప్పింది. తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇస్తానని చెప్పాడని చెప్పిన రాశీ… మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు తీసుకెళ్లాడని గుర్తు చేసుకుంది.

అక్కడకు వెళ్లి నాకు నచ్చినవన్నీ తిన్నా అని… నేను తింటున్నంత సేపు అతను నన్ను పొగుడుతూనే ఉన్నాడని వివరించింది. బిల్లు కూడా కట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో అది డేటింగ్ అనే విషయం కూడా నాకు తెలియదని రాశీ వ్యాఖ్యానించింది. నా జీవితంలో అదే ఫస్ట్, లాస్ట్ డేట్ అన్న… సినీ పరిశ్రమలోకి వచ్చాక కూడా ఎప్పుడూ డేటింగ్‌కు వెళ్లలేదని చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news