మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు అక్కడ పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఆ రాష్ట్రంలో దాదాపు ఆరు వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. పోలీసులకు, అధికారులకు, ఇతర సిబ్బందికి, జర్నలిస్ట్ లకు కూడా కరోనా వైరస్ సోకుతుంది.
తాజాగా మహారాష్ట్ర మంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా రావడం తో కలవరం మొదలయింది. ఆయన ఎవరు అనేది అధికారులు చెప్పలేదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో గోప్యంగా ఉంచింది. అయితే ఆయన ముంబై కి చెందిన మంత్రి అని సమాచారం. ఆయన బంధువుల్లో ఒకరు విదేశాల నుంచి వచ్చారని ఆయన నుంచి ఈయనకు కరోనా వైరస్ సోకి ఉందేమో అనే అనుమానాలను ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు.