ఏసీ, కూలర్ వాడుతున్నారా…? కేంద్రం చేసిన సూచనలు ఇవే…!

-

కరోనాను కంట్రోల్ చేయడానికి గానూ కేంద్రం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే వస్తుంది. రోజు రోజు కి కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇళ్లలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి గానూ ఎయిర్‌ కండిషనింగ్ (ఏసీ), వెంటిలేషన్‌‌పై కేంద్రం కొత్త సూచనలు చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేంటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్ (ఐఎస్‌హెచ్ఆర్ఏఈ) సూచించిన తాజా మార్గదర్శకాల ప్రకారం…

ఇళ్లలో ఏసీలు వాడే సమయంలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటే మంచిది అని హెచ్చరించింది. తేమ స్థాయి 40 నుంచి 70 శాతం వరకు ఉంటే మంచిదని పేర్కొంది. కూలర్ల విషయానికొస్తే మంచి వెంటిలేషన్ కోసం గానూ కూలర్లు బయటి గాలిని పీల్చుకునేలా ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కూలర్‌ ట్యాంకులు ఎప్పటికప్పుడు క్రిమిసంహారాలతో శుభ్రం చేసుకోవాలని చెప్పింది కేంద్రం. (మరింత చదవండి : ఈ కరోనా కాలంలో ఏసీ టెంపరేచర్‌ ఎంత ఉండాలి..? )

తరచూ నీటిని ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలని పేర్కొంది. తేమగాలి బయటికి పోయేలా కిటికీలు తెరిచి ఉంచాలని చెప్పింది. బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లు వాడకపోవడమే మంచిదని చెప్పింది. ఫ్యాన్లు వినియోగించేవారు కూడా కిటీకీలు కొద్దిగా తెరిచి ఉంచుకోవాలని చెప్పింది. దగ్గర్లో ఏదైనా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే.. తగిన వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్‌లో ఉంచడమే మంచిది అని సలహా ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news