వైరల్ వీడియో; గంగ ఎంత స్వచ్చంగా ఉందో చూడండి…!

-

కరోనా వైరస్ దెబ్బకు భారత దేశం మొత్తం లాక్ డౌన్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకపోవడం తో కాలుష్యం కూడా భారీగా తగ్గింది. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అనేక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నదులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. నీళ్ళు తాగే విధంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. గంగా నదిని శుభ్రం చేయకుండానే శుభ్రం అయిపోయింది.

రిషికేశ్ లోని లక్ష్మణ్ జులా కు సమీపంలో గంగా నది చాలా పరిశుభ్రంగా ఉంది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా పంచుకున్నారు. “24.04.2020 న లక్ష్మణ్ జులాకు సమీపంలో ఉన్న రిషికేశ్ వద్ద గంగా అంటూ ఆయన పేర్కొన్నారు. తాము అంతా స్వర్గం కోసం వెతుకుతున్నాం అని ఆయన వివరించారు. రిషికేశ్ ఒడ్డున గంగా ప్రవహించే నీరు నీలి రంగులో ఉంటుంది.

నది అడుగున ఉన్న రాళ్ళు సులభ౦గా కనపడుతున్నాయి. నీరు ఎంత స్వచ్చంగా ఉందో వీడియో లో చూడవచ్చు. వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అత్యంత వేగంగా వైరల్ అయింది. దాదాపు 10 లక్షల మంది ఈ వీడియో ని గంటల వ్యవధిలో వీక్షించారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఇది స్వచ్ఛమైన మరియు సహజమైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news