55 ఏళ్ళు దాటిన పోలీసులకు లీవ్… !

-

కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు వయసు పైబడిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్ళు బయటకు రావాలి అంటే చాలు భయపడుతున్నారు. ఇక వయసు పైబడిన పోలీసులు అయితే ఇప్పుడు డ్యూటి చెయ్యాలి అంటే నానా కష్టాలు పడుతున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటి చేసే పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేసే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది డ్యూటికి వెళ్ళే పరిస్థితి లేదు.

ఇప్పుడు పోలీసులకు కూడా కరోనా రావడం తో చాలా మంది పోలీసులు డ్యూటి చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అక్కడి ముంబై లో అయితే ఆరు వేల కేసుల వరకు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రతలు పడుతూ వస్తుంది. ముంబైలో కరోనా వచ్చి కొందరు వైద్యులు, పోలీసులు కూడా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు.

ముంబై పోలీసులు ముగ్గురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 55 ఏళ్ళు దాటిన పోలీసులు డ్యూటికి రావొద్దని, కుటుంబ సభ్యులు అందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. పోలీసు అధికారుల ఇళ్ళకు వెళ్లి కరోనా పరిక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ముంబై లో కరోనా కారణంగా 250 మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news