మహిళా డాక్టర్ తయారు చేసిన కరోనా పరికరం, ఇది ఉంటే మీ దగ్గరకు రాదు…!

-

కరోన వైరస్ ని కట్టడి చేయడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద సవాల్. దానికి మందు కనుక్కోవడానికి గానూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. రోజు రోజుకి పరిశోధనలను వేగవంతం చేస్తున్నారు. కరోనా ఎవరికి ఉంది అనే విషయం రోగికి పరిక్షలు నిర్వహించే వరకు తెలిసే పరిస్థితి ఉండదు. కరోనా రాకుండా ఉండాలి అంటే ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.

ఎన్ని తీసుకున్నా సరే అది ఒక్కసారి వచ్చింది అంటే దాన్ని ఆపడం మన తరం కాదు అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలుసు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండకు చెందిన డాక్టర్ నీలిమ అనే ఒక మహిళా డాక్టర్ ఒక పరికరాన్ని అభివృద్ధి చేసి అడ్వాన్స్ సంజీవిని అనే పేరు పెట్టారు. డివైజ్ ను మణికట్టుపై పెట్టుకుంటే రక్తంలోని హానికరమైన కణాలు ఉంటె వాటిని ఈ డివైజ్ శుభ్రం చేసేస్తుంది.

ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బ్లడ్ కాన్సెప్ట్ ద్వారా ఈ డివైజ్ తన సేవలు అందిస్తుంది. సాధారణంగా కరోనా వైరస్ తో బ్లడ్ క్లాడ్స్ ఏర్పడగా రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అవ్వడంక్రమంగా తగ్గిపోవడంతో ప్రాణం పోతుంది. అయితే ఈ డివైజ్ మాత్రం రక్తంలో ఉండే వైరస్ ని పూర్తిగా చంపేస్తుంది. రక్తనాళాల్లో ఉండే క్లాడ్స్ వంటివి పూర్తిగా కరిగిపోతాయని, ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద వీటికి అనుమతి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news