బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పెద్దపేగు సంబంధిత వ్యాధికి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
మక్బూల్ స్లం డాగ్ మిలియనీర్ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. మన తెలుగులో సైనికుడు సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా నటించాడు. అందులో పప్పు అనే పాత్రలో ఆయన నటన బాగా ఆకట్టుకుంది. ఆయనకు లండన్ లో కూడా చికిత్స చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. ఆయన వయసు 54 ఏళ్ళు. విచిత్రం ఏంటీ అంటే మూడు రోజుల క్రితం తల్లి కూడా మరణించారు.
విలక్షణ నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయనకు భార్యసుతాపా సిక్దెర్, మరియు కుమారులు బాబిల్ మరియు అయాన్ ఉన్నారు. గత రెండు రోజులుగా ఆయన మరణించారు అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన నటనకు పలు అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
My dear friend Irfaan. You fought and fought and fought. I will always be proud of you.. we shall meet again.. condolences to Sutapa and Babil.. you too fought, Sutapa you gave everything possible in this fight. Peace and Om shanti. Irfaan Khan salute.
— Shoojit Sircar (@ShoojitSircar) April 29, 2020