బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం నుంచి ఇంకా బయటకు రాకుండానే మరో నటుడు ఆరోగ్యం విషమంగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. ప్రముఖ హీరో రణబీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచార౦. రిషికపూర్ అనారోగ్యం పాలవడంతో బుధవారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించామని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ మీడియాకు చెప్పారు.
ఆయన పలు హిందీ సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన ముంబై లోని ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వెంట భార్య నీతూకపూర్ ఉన్నారని సమాచారం. రిషికపూర్ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉండటం తో కొడుకు రణబీర్ కపూర్ ఆస్పత్రికి వెళ్ళారు.
ఆయన 2018 లో క్యాన్సర్ వచ్చింది. దీనితో అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన దాని నుంచి కోలుకున్నారు. కలిసి భోజనం చేస్తున్న ఫోటో ని ఆయన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసారు. ఆయనకు మంచి నటుడుగా గుర్తింపు ఉంది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు.