ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే సామాజిక దూరం అనేది చాలా అవసరం. సామాజిక దూరం పాటించలేదు అంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక దూరానికి సంబంధించి ఎన్నో విధాలుగా అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చాలా అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజలు కూడా దీన్ని అర్ధం చేసుకుని సామాజిక దూరం పాటిస్తున్నారు.
ఇంట్లో అయినా సరే భౌతిక దూరం అనేది చాలా అవసరం అనే విషయం అర్ధమవుతుంది. భౌతిక దూరం లేకపోతే ఇబ్బంది పడటం ఖాయం. మన౦ బయటకు వెళ్లి వచ్చి ఏ వస్తుని పట్టుకుంటామో, ఏ వస్తువు మనకు తగులుతుందో దాని మీద వైరస్ ఉందో లేదో చెప్పాడ౦ చాలా కష్టం. ఈ పరిస్థితిని అర్ధం చేసుకుని త్రిపుర కు చెందిన ఒక వ్యక్తి ఒక బైక్ ని వినూత్నంగా తయారు చేసాడు. సామాజిక దూరం పాటించే విధంగా ఈ బైక్ ని తాయారు చేసి కనీసం 5 అడుగుల దూరం సీటింగ్ మధ్యలో ఉండే విధంగా రూపొందించాడు.
బైక్ పై ఒకరే ఉండాలి అని ప్రభుత్వం చెప్పడంతో త్రిపురలోని ఆరాలియాకు చెందిన వాహన మెకానిక్ పార్థ సాహా… ఇద్దరు ప్రయాణించేలా ఓ ఎలక్ట్రిక్ బ్యాటరీ బైక్‌ను అభివృద్ధి చేసారు. దీని 2సీట్ల మధ్య దూరం ఒక మీటరుకంటే ఎక్కువ ఉండే విధంగా తయారు చేసారు. బ్యాటరీ(లిథియం అయాన్) పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 3గంటల సమయం పడుతుంది అని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కి.మీ. దూరం వెళ్లగలదని అతను చెప్పాడు. గేర్లు ఏమీ ఉండవు… ఎవరు అయినా సరే నడిపే విధంగా ఉంటుంది.