విషవాయువు ప్రభావం నుంచి ఇలా తప్పించుకోండి …!

-

ప్రశాంతంగా ఉన్న సాగరతీరం విశాఖపట్టణం ఉదయాన్నే ఒక్కసారిగా విషవాయువు చొచ్చుకు వచ్చింది. విషవాయవు ప్రభావం వల్ల ప్రజలు ఎక్కడికక్కడ స్పృహ కోల్పోవడం, మరి కొందరు ప్రాణాలు కోల్పవడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలు ఏమైందో అర్దం కాక గందరగోళానికి గురయ్యారు. స్పృహ కోల్పోయిన వారిని హుటాహుటిన ఆసుపత్రి లో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఒకవేళ ఇంకా ఎవరైన వైజాగ్ లో వారికి ఆ విష వాయువు ప్రభావం ఉన్నట్లుంటే ఈ క్రింది పనుల ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

1.అప్పటికే శరీరం మీద వున్న బట్టలు తీసేసి,శరీరమంతా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు 15 నిమిషాల వరకు కడుక్కొని బట్టలు మార్చుకోవాలి.

2.కళ్ళని కూడా నీళ్లతో కానీ సెలైన్ తో కానీ కడుక్కోవాలి.

3.అవకాశం ఉన్నంత వరకు మంచి స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశం లో ఉండాలి.ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాలి.

4.ఆ గ్యాస్ బయట శరీరంలో 7- 8 గంటలు ప్రభావం చూపిస్తోంది, ఆ సమయంలో వీలైనన్ని నీళ్లు తాగితే మూత్రం ద్వారా దాని అవశేషాలు బయటికి పంపించొచ్చు.

5.వీలైనంత వరకు కళ్ళు ముట్టుకోకూడదు,శరీరం మీద గీరకూడదు.

6.పొట్టలోకి పోయినట్లు అనుమానం గా ఉండి, వాంతులు, వికారం లా ఉంటే ఆహారం తీసుకోవడంలో ముఖ్యంగా, నూనెలు, కొవ్వులు అప్ పదార్థాలు తీసుకోవడం ఆపాలి.

ఎటువంటి శ్వాస పీల్చుకోవటం లో ఇబ్బందులు ఉంటే దగ్గరిలో ఆక్సిజన్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Latest news