బంగారంతో సమానం గిర్ జాతి పశువులు… క్యాన్సర్ కు ఈ ఆవు మూత్రం వాడుతారట..! 

-

ఆవులు ఉత్పత్తులతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అని తెలుసు కానీ, బంగారాన్ని ఉత్పత్తి చేసే గుణం ఆవు మూత్రంకు ఉందంటే మీరు నమ్మగలుగుతారా. అవును.. గిర్ జాతీ ఆవుల మూత్రంలో బంగారం ఉందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఒక్క బంగారాన్నే కాదు..వీటి మూత్రంలో క్యాన్సర్ కు చికిత్స చేయొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే..నడిచే బంగారం గిర్ ఆవు. ఈరోజు ఈ ఆవు ప్రత్యేకతలు ఏంటో విపులంగా తెలుసుకుందాం.
గిర్ ఆవులు-దూడల మూత్రంలో లీటరుకు 3 నుంచి 10 మి.గ్రా. వరకు నీటిలో కరిగే స్వభావం ఉన్న బంగారం ఉందని క్రొమటోగ్రఫీ, మాస్స్పిక్టోమెట్రీ సాయంతో గుజరాత్లోని జునాఘడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బీఏ గొలాకియా నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు కనుగొన్నారు. ఇతర ఏ జంతువు మూత్రంలోనూ ఈ స్థాయిలో నేటి వరకు కనుగొనలేదు. రోజుకు ఒక్కో ఆవు నుంచి లభించే సుమారు పది లీటర్ల మూత్రంలో 30 నుండి 100 మి.గ్రా. బంగారం లభ్యమయ్యే అవకాశాలున్నాయట. ఈ బంగారం గిర్ ఆవుల శరీరంలో ఏ విధంగా తయారవుతుందో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాణిజ్య స్థాయిలో గోమూత్రం నుంచి బంగారాన్ని పొందాలంటే కొన్ని వందల గిర్ జాతి పశువుల్ని ఒకే ప్రాంతంలో నుంచి సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బంగారం లభ్యత దూడల మూత్రంలో అత్యధికంగా ఉన్నట్టు వారు గుర్తించారు. పాలిచ్చే ఆవులు, వట్టిపోయిన ఆవులు, ఎద్దుల మూత్రంలో బంగారం పరిమాణం క్రమంగా తగ్గినట్లు తెలిపారు. ఈ పశువుల ఉదయపు మూత్రంలోనే ఎక్కువ బంగారం ఉన్నట్ల గుర్తించారు. ఆడ-మగ గిర్ పశువుల మధ్య సంపర్కం జరిపి ఎక్కువ స్థాయిలో బంగారాన్ని పొందే దిశలో జన్యు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం ఉంది.

రోగనిరోధక శక్తిని పెంచే గుణం

అత్యంత ఖరీదైన స్వర్ణభస్మానికి ప్రత్యామ్నాయంగా కూడా గిర్ ఆవుల మూత్రాన్ని కొన్ని ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తున్నారు. గిర్ జాతి ఆవులు, దూడల మూత్రంలో 5100 ఔషధ దాతువులను పరిశోధకులు గుర్తించారు. వీటిలో సుమారు 400 ధాతువులను అత్యంత కీలకమైనవిగా పేర్కొంటున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం గిర్ ఆవుల మూత్రంలో ఎక్కువగా ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కరోనా ఉపద్రవ కాలంలో లీటరుకు రూ.100-120 వరకు వెచ్చించి శుద్ధిచేసిన గిర్ ఆవు మూత్రాన్ని కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇదికాక కేన్సర్ నివారణకు, హృద్రోగ సమస్యలకు, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసేందుకు కూడా గిర్ ఆవుల మూత్రం ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు.

పర్యావరణానికి మేలు

గిర్ జాతి పశువుల పేడ మూత్రాలను ఎరువుగా వాడితే.. భూసారాలు పెరిగి నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు లభిస్తాయట. ఫలితంగా హానికర రసాయన ఎరువులు కీటకనాశక రసాయనాల వాడకం తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది.

గిర్ అని ఎందుకు పిలుస్తున్నారు..?

గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతం ఈ ఆవులకు పుట్టినిల్లు. అందువల్లే ఈ జాతికి ‘గిరి’ ఆవులు అంటారు.. అక్కడి జునాఘడ్, బతియవార్, భావనగర్, రాజ్ కోట్, అమ్రేలీ జిల్లాల్లో స్వచ్ఛమైన గిరాజాతి ఆవులు, ఆంబోతులు లభిస్తాయి. గిర్ జాతి పశువుల విలువను గుర్తించిన అమెరికా, బ్రెజిల్, వెనిజులా వంటి దేశాలు గిర్ ఆంబోతులను దిగుమతి చేసుకొని అక్కడ పశుసంపదను అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే దక్షిణ భారతంలోనూ గిర్ ఆవుల పెంపకాన్ని డెయిరీల నిర్వాహకులు చేపడుతూ ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం గిర్ ఆవు ధర రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు పలుకుతోంది.

గిర్ జాతి పశువుల లక్షణాలు ఎలా ఉంటాయి.?

భారత్లో ఉండే గిర్ ఎద్దులు సుమారు 500 కిలోలకు పైగా, ఆవులు 380 నుండి 400 కిలోల శరీర బరువు కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎరుపు రంగులో, కొన్ని నలుపు-తెలుపు రంగుల్లో కూడా ఉంటాయి. మరికొన్ని ఆకర్షణీయమైన బంగారు వర్ణంలో ఉంటాయి. భారీ మోపురం, గంగడోలు, వదులైన మెరిసే మృదువైన చర్మంతో గిర్ జాతీ ఆవులు ప్రత్యేకంగా ఉంటాయి.. ఇవి అధిక ఉష్ణోగ్రతలనూ కూడా తట్టుకుంటాయి. పటిష్టమైన గిట్టలు, కాళ్ల వల్ల ఇవి సేద్యపు పనికి కూడా అనువైనవనటే. ఈ జాతి ఎద్దులు, ఆవులు సాధు స్వభావంతో యజమానులతో స్నేహంగా మెలుగుతాయి. పొడవటం, రంకలేయటం లాంటి ఇబ్బందులు పెట్టవట.
ముఖ్యంగా విశాలంగా ఉండే నుదురు వల్ల వీటి మెదడులోని పిట్యుటరీ గ్రంథి చురుకుగా ఉండి పాల ఉత్పత్తిని, అధిక పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు.. వేలాడే పెద్ద చెవులు, పటిష్టంగా ఉండి, వెనుకకు తిరిగి పైకి చూసే కొమ్ములు, పొడవైన తోక చురుకుగా జలదరించే చర్మం ఈ పశువుల్లో ఉండే ఇతర లక్షణాలు. గిర్ ఆవుల పొదుగు గుండ్రంగా, బాగా పెద్దగా పొడవైన రొమ్ములతో యంత్రాలతోనూ పాలు పితికేందుకు అనుకూలంగా ఉంటాయి.
గిర్ ఆవు పెయ్యలు 20-24 నెలల్లో యుక్త వయస్సుకు వచ్చి సుమారు 280 నుండి 285 రోజులు చూడితో ఉంటాయి. ఈనిన 3-4 నెలల్లో మళ్లీ గర్భధారణ చేయగలవు. 12-15 సంవత్సరాల జీవితకాలంలో ఇవి సుమారు 9-10 దూడల వరకు జన్మనిస్తాయట.. సగటున 1.5 నుండి 1.9 వీర్యదానాలకే గర్భం నిలుపుకోగలవు. ఈతలో 300 రోజుల్లో సగటున 1500 నుండి 2000 లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుంది. పాలలో 4.5 నుండి 5.0 శాతం అత్యంత నాణ్యమైన వెన్న లభిస్తుంది. సగటు దినసరి పాల ఉత్పత్తి 10 నుండి 15 లీటర్లదాకా ఇస్తాయి. ఎంపిక చేసిన ఆవులు- గిర్ ఆంబోతులకు జన్మించిన సంతతి ఆవుల్లో పాల ఉత్పత్తి రోజుకు 20 లీటర్ల వరకూ ఉంటుంది.

కేన్సర్ నివారణలో..

గిర్ ఆవుల మూత్రాన్ని వినియోగించి గుజరాత్లోని కొందరు వైద్య ప్రముఖులు కేన్సర్ నివారణలో సైతం విజయం సాధించారు. అయితే ఇది ప్రయోగ-అధ్యయన దశలోనే ఉంది. వాణిజ్య స్థాయిలో గిర్ ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయాలంటే రోజుకు అనేక వేల లీటర్ల గోమూత్రాన్ని శాస్త్రీయంగా పరిశుభ్రంగా సేకరించి శుద్ధి చేయాలి. గిర్ పశు సంపదను విస్తరిస్తే మన పాడి రైతులకు, పాల వినియోగదారులకే కాక, ప్రకృతికి, సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆయుర్వేద వైద్య రంగంలో ముఖ్యంగా కేన్సర్ చికిత్సలో మంచి ఫలితాలనిస్తున్న గిర్ జాతి మూత్రానికి పెరుగుతున్న విశ్వవ్యాప్త గుర్తింపు, బంగారం లభ్యతను గమనించి విదేశాలు, ప్రైవేటు సంస్థలు గిర్ ఆవులు- వాటి ఉత్పత్తులపై పేటెంట్ హక్కుల్ని హస్తగతం చేసుకోక ముందే కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యల్ని చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version