సంకరజాతి ఆవుల్లో ఎరుపు మూత్రవ్యాధి నివారణ చర్యలు..

-

సంకరజాతి జంతువుల్లో ఎరుపు మూత్ర వ్యాధి ఎక్కువగా వస్తుందన్న విషయం తెలిసిందే..దీన్ని టెక్ ఫీవర్ అని కూడా అంటారు. కొన్ని రకాల పరాన్న జీవులు పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో ఈ వ్యాధిని కలిగిస్తాయి.వ్యాధి బారిన పడిన వాటి నుంచి దోమల వల్ల మామూలు వాటికి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. గోమార్ల కాటువల్ల పశువుల్లో 10 రోజుల కాల వ్యవధిలోనే ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన తరువాత జ్వరం తీవ్రస్ధాయిలో వస్తుంది. పశువుల కండరాలు వణకటంతోపాటు, మేత మేయని స్ధితికి చేరుకుంటుంది. నెమరు వేయటం ఇబ్బందిగా మారుతంది. శ్వాసను వేగంగా తీసుకుంటుంటాయి. కళ్ల పొరలు రక్తలేమితో పాలిపోయి ఉంటాయి. కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన పశువులు మూత్రం పోస్తే రక్తంతో కూడిన ఎరుపు లేదా కాఫీ రంగులో ఉంటుంది..

ఎరుపు మూత్ర వ్యాధి నివారణ చర్యలు..

కేజీ బరువుకు 3.5 నుండి 7 మిలీగ్రాముల చొప్పున బెరినిల్, దిమినజైన్ కండకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులతోపాటుగా అవసరాన్ని బట్టి డెక్సోజ్ సెలైన్, బికాంప్లెక్స్ , ఐరన్ ఇంజెక్షన్లూ వాడుకోవాలి. రక్తహీనత తీవ్రంగా ఉన్నట్లైతే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. బ్లూటాక్స్ వంటి మందులను తగిన మోతాదులో పశువులపై పిచికారి చేస్తే శరీరంపై ఉండే వ్యాధికారక క్రిములు నశిస్తాయి.
ఇకపోతే పశువుల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. పాకల చుట్టూ మురుగు నీరు నిల్వ కుండా చూసుకోవాలి. డ్రెయిన్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక పశువుకు వాడిన సూదులను మరో పశువుకు వాడరాదు. పశువు నలతగా కనబడితే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి తగిన చికిత్స అందిచాలి..వ్యాధిని అదుపు చెయ్యడానికి టీకాలను కూడా వేయించాలి..అలాగే జబ్బు చేసిన ఆవులను మంద నుంచి వేరు చెయ్యాలి..సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలిి..

Read more RELATED
Recommended to you

Exit mobile version