Iran : సర్కార్ అణచివేతపై గళమెత్తిన ఆస్కార్ నటి అరెస్టు

-

ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై ప్రపంచ దేశాలు గళమెత్తాయి. పలువురు సెలబ్రిటీలు మద్దతు కూడా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ఇరాన్ మహిళలకు మద్దతుగా తమ జుట్టు కత్తిరించుకున్నారు.

గత మూడు నెలల నుంచి కొనసాగుతోన్న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఇద్దరికి ఉరి శిక్ష అమలు చేసిన ప్రభుత్వం అనేక మందికి జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తిని అరెస్టు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఆమె సంఘీభావం తెలపడమే దానికి కారణం. హిజాబ్‌ ఆందోళనల విషయంలో అబద్ధాలను వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై పోలీసు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

టెహ్రాన్‌లో నిరసనల్లో పాల్గొన్న మొహసెన్‌ షెకారీ అనే యువకుడిని ఇరాన్‌ ఇటీవల ఉరి తీసింది. అలీదూస్తీ దీన్ని తీవ్రంగా ఖండించారు. అతని ఉరిశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడంపై అంతర్జాతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఈ రక్తపాతాన్ని చూస్తూ స్పందించని ప్రతి అంతర్జాతీయ సంస్థ.. మానవత్వానికే మాయని మచ్చ’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విమర్శించారు. అయితే, 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇటీవల తొలగించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version