మెంతికూరను సాగు చేయడం ఎలాగో తెలుసా.. ?

-

మెంతికూర గురించి తెలియని వారుండరు, టమోటాలో మెంతి వేసి వండితే ఆహా.. ఎంత రుచిగా ఉంటుందో. తలుచుకుంటేనో నోట్లో నీళ్లూరుతున్నాయి. మన దేశంలో ప్రతి ఇంట్లో మెంతి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత గల మెంతిని సాగు చేయడం చాలా సులభం. కాస్త శ్రద్ధ వహించి.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెంతిసాగు చాలా ఈజీగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరి మెంతిని ఎలా సాగు చేయాలి..? ఏ కాలంలో సాగు చేయాలి.. తెలుసుకుందామా..?

వేగంగా పెరిగే ఆకు కూర కోసం వసంత కాలం చివరిలో విత్తనాలను వేయాలి. విత్తనాలు త్వరగా మొలకెత్తాలంటే భూమిలో 1/4 వంతు లోతుతో గుంటలు చేసి, ఒక్కో గుంటకి 8 నుంచి 18 అంగుళాల దూరంలో వరుసలలో నాటాలి. కొన్ని రోజుల్లోనే ఇవి మొలకెత్తి బయటకు వస్తాయి. వీటికి క్రమం తప్పకుండా నీళ్లు పట్టాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువైతే మెంతి నారు పాడవుతుంది. విత్తనాలు వేసిన తర్వాత మొదట నీళ్లు పట్టాలి. తర్వాత వారం నుంచి పది రోజుల విరామం ఇచ్చి మళ్లీ నీళ్లు పట్టాల్సి ఉంటుంది.

సాధారణంగా మెంతి కూరను పొడి బారిన నెలలో నాటుతారు.ఎందుకంటే ఆ పొడి నేలలో 6.5 నుండి 8.2 వరకు పీహెచ్ విలువను కలిగిన ఆల్కలిన్ తటస్థంగా ఉంటుంది. దీని కారణంగా ఆ మొక్కలు త్వరగా పెరుగుతాయి. అందువల్ల విత్తనాలు నాటిన 20 నుండి 30 కోతకు సిద్ధంగా ఉన్న ఆకులు ఉత్పత్తి అవుతాయి. ఒకహెక్టార్ కు 15 టన్నుల వ్యవసాయ యార్డ్ ఎరువుతో పాటు, 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాష్ ను ఉపయోగించడం జరుగుతుంది. నత్రజని మోతాదులో సగం భాస్వరం, పొటాష్ మొత్తం పరిమాణం మొదటి సారి ఎరువులు చల్లేటప్పుడు ఉపయోగిస్తారు. మిగిలిన సగం నత్రజని విత్తిన 30 రోజుల తరువాత ఉపయోగిస్తారు. మరింత ఆరోగ్యవంతమైన ఆకు పెరుగుదల కోసం ప్రతి కటింగ్ తర్వాత నత్రజనిని వాడాల్సి ఉంటుంది.

25 రోజుల నుంచి 30 రోజుల కాల వ్యవధిలో 4 నుంచి 5 సెంటి మీటర్ల పొడవు ఉన్న చిన్న చిన్న మొలకలు భూమి నుంచి బయటకు రావడం మనం గమనించవచ్చు. తరువాత 15 రోజుల కాలంలో మనకు కోతకు సిద్ధంగా ఉన్న మొక్కలుగా ఎదుగుతాయి. ఒకవేళ రెండు (విత్తనాలు, ఆకుకూర) ప్రయోజనాల కోసం పంటను వేస్తే ఒక హెక్టారు కు

1200 నుంచి 1500 కిలోల మెంతులు, 800 నుంచి 1000 కిలోల మెంతి కూర దిగుబడి పొందొచ్చు.

మెంతికూరను మన ఇంట్లో కూడ పెంచొంచ్చు. దీర్ఘచుతరస్త్రాకారంలో ఉండే ఓ కుండీలో సగానికంటే ఎక్కువగా మట్టి నింపి అందులో విత్తనాలు వేయాలి. ప్రతి రోజు కొద్ది కొద్దిగా నీళ్లు అందిస్తూ ఉంటే నెల రోజుల్లో మీరు కూర వండుకునేలా మెంతి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news