బఠాణిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి..మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు..ఈ పంట ను పండించే ముందు నేల పరీక్ష చేయించాలి.. ఎటువంటి రకాలు మంచి దిగుబడిని పెంచుతాయో తెలుసుకోవాలి.బఠాణి సాగుకు అనువైన రకాలు..ఇందులో కొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్వల్పకాలిక రకాలు..
ఎర్లీబాడ్గర్: ముడతలు గల గింజలతో కూడిన పొట్టిరకం. 55 నుండి 60 రోజులలో కోతకు వస్తుంది.
అర్మెల్: ముడతలు గల గింజలతో కూడిన అధిక దిగుబడినిచ్చే పొట్టి రకం. 60 రోజులలో ఆకుపచ్చని కాయలతో కోతకు వస్తుంది.
మీటియర్: బుతువులో ముందుగా వేయుటకు అనుకూలమైన రకం. విత్తనాలు నునుపుగా వుంటాయి. 60-65 రోజులలో ఆకుపచ్చని కాయలతో కోతకు సిద్ధంగా వుండే రకం.
జవహార్ మటర్-4: మొక్కలు పొడవుగా, కాయలు మధ్యస్థంగా వుంటాయి. గింజలు ఆకుపచ్చగా, పెద్దవిగా ముడతలు కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు 24 క్వింటాళ్ళు.
హిస్సార్ హరిత్: కోతకు 60 రోజులలో సిద్ధమవుతుంది. కాయలు గింజలతో పూర్తిగా నిండి ఉంటాయి…
మధ్యకాలిక రకాలు..
బోర్న్‌విల్లీ: బుతువు మధ్యలో వేయుటకు అనువైన రకం. ఎక్కువ ఎత్తు పెరగదు. గింజలు ముడతలు కలిగి ఉండి తియ్యగా వుంటాయి. 85 రోజులలో కోతకు వస్తుంది. పచ్చికాయల
దిగుబడి ఎకరాకు 40 క్వింటాళ్ళు.
జవహార్ మటర్-1 ;. కాయలు పెద్దవిగా ఆకర్షణీయంగా, చివర వంపు కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు 48 క్వింటాళ్ళు
జవహార్ మటర్-2: గింజలు పెద్దవిగా ముడతలు కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు 40 క్వింటాళ్ళు.
ఐ.పి.-8: మధ్యస్థ రకం. కాయలు మధ్యస్థం. ఏడు గింజలు కలిగి ఉంటాయి. ఎకరాకు 100 క్వింటాళ్ళ దిగుబడి నిస్తుంది..
దీర్హకాలిక రకాలు..
ఎన్.పి.-29: మొక్కలు ఎత్తుగా ఎదుగుతాయి. ముడతలు పడిన గింజలుగల రకం. 100 రోజులలో కోతకు వస్తుంది.
ఇవి కాక ఆజాద్-పి-1 ఆజాద్ పి-2 మరియు బూడిద తెగులును తట్టుకునే రకాలు కూడా సాగుచేసుకొనవచ్చు.
ఆఖరి దుక్కిలోఎకరాకు 8 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. అనుకూలంగా బోదెలు, కాలువలు చేయాలి. నేలను సమానంగా మొలక రావడానికి అనుకూలమైన స్థితిలో వుంచాలి. విత్తన మోతాదు, విత్తేదూరం: ఎకరాకు స్వల్భకాలిక రకాలకు 40-48 కిలోలు. మధ్య మరియు దీర్హక్షాలిక రకాలకు 32-36 కిలోల విత్తనం కావాలి. వరుసల మధ్య 30 సెం.మీ. మరియు వరుసల్లో మొక్కకు, మొక్కకు 15 సెం.మీ. ఎడం వుండాలి..
అక్టోబర్, నవంబర్ మాసాలలో విత్తు కోవచ్చు..కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండజిమ్ చొప్పున కలిపి విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఎకరాకు 10 కిలోల నత్రజని, 28 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌లను విత్తే సమయంలో వేయాలి. భాస్వరం, పొటాష్ ఎరువులు బఠాణీలో నత్రజని స్థాపించే సామర్ధ్వాన్ని పెంచుతాయి.. పంట మార్పిడి చేసినా మంచి దిగుబడిని పొందవచ్చు.. ఇతర సమాచారం కోసం దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..