Hair Growth : అమ్మాయిలు లేదా అబ్బాయిలు వారి అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టు ఎంతో దోహదం చేస్తుందనే సంగతి మనకు తెలిసిందే. జుట్టు లేకపోతే అందం కూడా కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఆరోగ్యవంతమైన జుట్టును పెంపొందించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తరచూ జుట్టు రాలిపోవడం బలహీనంగా మారడం వంటి సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల చిట్కాలను ప్రయత్నించి ఉంటారు. కానీ మర్రి వేర్లతో ఇలా చేస్తే మీ జుట్టుకు మహర్దశ ఉంటుందని చాలా ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుందని చెప్పాలి.
ఆయుర్వేదంలో కూడా మర్రి వేర్లకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది.. ఈ క్రమంలోనే అధికంగా జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు వారి ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి అలాగే ఏ విధమైనటువంటి థైరాయిడ్ సమస్య లేకుండా ఉండాలి ఇలాంటి సమస్యలు లేనప్పుడే ఈ మర్రి వేర్లతో తయారు చేసే ఈ ఔషధ తైలం జుట్టు పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పాలి.
ముందుగా మర్రి వేర్లు 250 గ్రాములు తీసుకొని వాటిని నీటిలో శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఇలా బాగా ఎండిన తర్వాత వాటిని చూర్ణంలా తయారు చేసుకోవాలి. ఇలా చూర్ణం చేసిన తర్వాత కూడా 250 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. ఈ చూర్ణం ఒక కిలో కొబ్బరి నూనెలోకి వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన కొబ్బరి నూనెను వారం రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. ఇలా ఎండిన తర్వాత శుభ్రమైన వస్త్రం తీసుకొని ఆ నూనెను అందులోకి వేసి వడబోయాలి. ఇలా వడబోసిన నూనెను ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో జుట్టు కుదుళ్ళకు రాయటం వల్ల జుట్టు పెరుగుదల మంచిగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా దృఢంగా కూడా ఉంటుంది.