స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా కు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండే పై ఇటీవల కుణాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇటీవల కుణాల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఆయన పై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్ 07 వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కుణాల్ తన షోలో ప్రత్యేకంగా ఎవ్వరినీ ప్రస్తావించలేదని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ కుణాల్ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. ఇటీవల ముంబయిలో కుణాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏక్ నాథ్ శిండే పై ఓ పేరడీ పాను ఆలపించడం ఈ వివాదానికి కారణం అయింది. డిప్యూటీ సీఎం పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.