ఎండ వల్ల ఫేస్‌ టాన్‌ అవుతుందా..? ఇంట్లోనే ఈ మాస్కులు ట్రై చేయండి

-

సమ్మర్‌లో స్కిన్‌కు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండకు ముఖం పొడిబారుతుంది, టాన్‌ అవుతుంది. ఈ సమ్మర్‌లో స్కిన్‌ టాన్‌ను తొలగించడానికి చక్కటి హోమ్‌ రెమిడీస్‌ ఉన్నాయి. మీరు చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి పార్లర్‌లో ఫేషియల్స్‌ చేయించుకోవక్కర్లేదు.. వంటగదిలోనే బోలెడు ఐటమ్స్‌ ఉన్నాయి.. డీటాస్‌ ఫేస్‌ మాస్కులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!
కాఫీ పౌడర్ మొదటి చర్మ సంరక్షణ పదార్ధంగా చెప్పబడుతుంది. చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి కాఫీ పౌడర్ చాలా మంచిది. చర్మం నుండి సన్ టాన్ తొలగించడానికి కాఫీ పౌడర్ మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాఫీ పౌడర్, అలోవెరా జెల్ మిక్స్ చేసి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. సన్‌టాన్‌ను తొలగించడానికి ఇది ఉత్తమమైన ఫేస్ ప్యాక్.
కీరదోసకాయ ఆరోగ్యానికే కాదు చర్మాన్ని కూడా కాపాడుతుంది. కీరదోసకాయలో చాలా ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం యొక్క హైడ్రేషన్‌ని పెంచుతుంది. సహజంగా మెరిసే ఛాయను ఇస్తుంది. రోజూ దోసకాయ రసాన్ని మీ ముఖంపై మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది.
టొమాటోలు మొటిమలను నివారించడంలో సహాయపడతాయి, అందమైన మెరుపును ఇస్తాయి, జిడ్డును తగ్గిస్తాయి. వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి. టొమాటో గుజ్జులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. టొమాటోలు ముఖంపై ఉండే అదనపు జిడ్డు, మురికిని కూడా తగ్గిస్తాయి. రోజూ ముఖం మరియు మెడపై టమోటా రసాన్ని రాయండి. ఇది ముఖంలోని నల్ల మచ్చలు తొలగిస్తుంది. ఏది చేసినా వారానికి మూడు నాలుగు సార్లు అయినా చేయాలి. ఎప్పుడో ఒకసారి చేసి హే ఏం ఉపయోగం లేదు.. వేస్ట్‌ అని లైట్‌ తీసుకోకండి.! నెల రోజులు పాటు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా చిట్కా వల్ల  మీ ముఖం ఇంకా నల్లగా అవుతుంది అంటే.. అది రెండు సార్లు వేసుకున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి మీ చర్మానికి సెట్ అవలేదు అని దాన్ని వదిలేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news